అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా

అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను..  విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా

అమెరికాలో ఫెర్న్ అనే విపరీతమైన మంచు తుఫాను కారణంగా ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసింది. అమెరికాలో 'ఫెర్న్' అనే శీతాకాల తుఫాను వల్ల భారీగా మంచు కురుస్తోంది. ఈ కారణంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. దింతో రేపు ఆదివారం(25 జనవరి) నుండి సోమవారం(26 జనవరి) వరకు  ప్రయాణించాల్సిన విమానాలన్నీ రద్దు అయ్యాయి. అలాగే న్యూయార్క్, న్యూజెర్సీలోని న్యూవార్క్ నగరాలకు వెళ్లే, అక్కడి నుండి వచ్చే విమానాలు ఆగిపోయాయి.

 అమెరికాలోని దక్షిణ, తూర్పు, సెంట్రల్  ప్రాంతాల్లో విపరీతమైన మంచు కురవడమే కాకుండా, బలమైన గాలులు వీస్తున్నాయి. దీనివల్ల విమానాలు నడపడం ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా విమాన సంస్థలు కొన్ని వెసులుబాట్లను కల్పిస్తున్నాయి. అయితే మరికొన్ని విమానాలు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

విమానాలు రద్దు కావడం వల్ల ప్రయాణికులు టికెట్లను మార్చుకోవడానికి లేదా క్యాన్సిల్ చేసుకోవడానికి కొన్ని రాయితీలు ఇస్తున్నారు. ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్‌ను సంప్రదించి మీ ఫ్లయిట్ స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిదని సూచించింది.