హెలికాప్టర్‌‌ క్రాష్‌‌పై ఎయిర్ మార్షల్ ఆధ్వర్యంలో దర్యాప్తు

హెలికాప్టర్‌‌ క్రాష్‌‌పై ఎయిర్ మార్షల్ ఆధ్వర్యంలో దర్యాప్తు
  • ఎయిర్‌‌ మార్షల్ మానవేంద్రసింగ్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ: రాజ్‌‌నాథ్​ సింగ్​
  • బ్లాక్ బాక్స్ రికవర్ చేసినం
  • లైఫ్‌‌ సపోర్ట్‌‌పై కెప్టెన్ వరుణ్ సింగ్
  • పార్లమెంటులో ప్రకటన చేసిన రక్షణ మంత్రి

తమిళనాడులోని కూనూర్ వద్ద హెలికాప్టర్‌‌‌‌ కూలిపోయిన ఘటనపై దర్యాప్తు మొదలైంది. ఎయిర్‌‌‌‌ మార్షల్ మానవేంద్రసింగ్ ఆధ్వర్యంలో ట్రై సర్వీసెస్ ఎంక్వైరీ జరుగుతోంది. హెలికాప్టర్ క్రాష్, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతిపై రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ గురువారం పార్లమెంటులో ప్రకటన చేశారు. ప్రమాదం నుంచి తీవ్ర గాయాలతో బయటపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్.. ప్రస్తుతం లైఫ్‌‌ సపోర్ట్‌‌పై ట్రీట్‌‌మెంట్ పొందుతున్నారని వెల్లడించారు. ప్రమాదం జరిగిన చోటు నుంచి బ్లాక్ బాక్స్‌‌ను రికవర్ చేసినట్లు తెలిపారు. మరోవైపు 13 మంది పార్థివ దేహాలను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. శుక్రవారం రావత్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరగనున్నాయి.

తమిళనాడు పోలీసుల దర్యాప్తు 
కూనూర్: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై సీఆర్ పీసీ సెక్షన్ 174 కింద తమిళనాడులోని నీలగిరి జిల్లా పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. అడిషనల్ డీఎస్పీ ముత్తుమాణికంను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నియమించారు. ప్రమాదంలో చనిపోయినోళ్ల డెడ్ బాడీలను ఢిల్లీకి తరలించేందుకు కోయంబత్తూరుకు తీసుకెళ్తుండగా రెండు మైనర్ యాక్సిడెంట్లు జరిగాయి. కోయంబత్తూరు శివార్లలో ఓ అంబులెన్స్.. ముందట వెళ్తున్న మరో వెహికల్ ను ఢీకొట్టింది. దీంతో అందులోని డెడ్ బాడీని మరో అంబులెన్స్ లోకి ఎక్కించి తరలించారు. అంబులెన్స్ లకు ఎస్కార్ట్ గా వెళ్లిన పోలీస్ వెహికల్ కూ యాక్సిడెంట్ అయింది. కొందరు పోలీసులు గాయపడ్డారు. సైనికుల మృతికి సంతాపంగా శుక్రవారం షాపులు, హోటళ్లు క్లోజ్ చేయనున్నట్లు ఊటీ వ్యాపారులు ప్రకటించారు. 
వరుణ్​సింగ్ కండిషన్ సీరియస్.. 
ప్రమాదంలో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కండిషన్ సీరియస్ గా ఉంది. ఆయనకు మెరుగైన ట్రీట్ మెంట్ అందించేందుకు వెల్లింగ్టన్ లోని ఆర్మీ హాస్పిటల్ నుంచి బెంగళూరులోని కమాండ్ హాస్పిటల్ కు తరలించారు. అంబులెన్స్ లో సూలూరు ఎయిర్ బేస్ కు తీసుకెళ్లి, అక్కడి నుంచి బెంగళూరుకు ఎయిర్ లిఫ్ట్ చేశారు.
ఇయ్యాల రావత్ అంత్యక్రియలు
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధూలికా రావత్ అంత్యక్రియలు శుక్రవారం ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ క్రిమటోరియంలో జరగనున్నాయి. శుక్రవారం ఉదయం కామరాజ్ మార్గ్​లోని రావత్ నివాసంలో వారిద్దరి భౌతికకాయాలను ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. 2 గంటలకు అంతిమయాత్ర మొదలవుతుంది. తర్వాత మిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.