ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్‌

V6 Velugu Posted on Apr 10, 2021

రివార్డ్స్‌123 సేవింగ్ అకౌంట్స్‌ పేరుతో కొత్త సేవింగ్‌ అకౌంట్స్‌ను ఎయిర్‌టెల్‌ పేమెంట్ బ్యాంక్‌ ప్రకటించింది. ఈ బ్యాంక్‌ అకౌంట్‌ను ఉపయోగించే కస్టమర్లు చేసే డిజిటల్‌ లావాదేవీలకు కొత్త ప్రయోజనాలను ఆఫర్‌ చేస్తోంది. రివార్డ్స్‌ 123 అకౌంట్‌ కేవలం రూ. 299 వార్షిక ఫీజుతో అందిస్తుంది. ప్రీ పెయిడ్‌ రీచార్జీలు, పోస్ట్‌ పెయిండ్‌, బ్రాడ్‌బ్యాండ్‌, ల్యాండ్‌ లైన్‌, డీటీహెచ్‌ బిల్ పేమెంట్స్‌పై క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది.  అంతేకాదు లోడ్‌ మనీ బెనిఫిట్స్‌తో పాటు షాపింగ్‌ రివార్డ్స్‌ ఉంటాయని తెలిపింది ఎయిర్ టెల్. జీరో మినిమం బ్యాలెన్స్‌, ఉచిత ప్లాటినమ్‌ ఆన్‌లైన్‌ మాస్టర్‌ డెబిట్‌ కార్డు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Tagged Airtel

Latest Videos

Subscribe Now

More News