మెట్రో స్టేషన్లలో ఫ్రీ పార్కింగ్​ కల్పించాలి

మెట్రో స్టేషన్లలో  ఫ్రీ పార్కింగ్​ కల్పించాలి
  • ఏఐవైఎఫ్ నాయకులు

ఉప్పల్, వెలుగు : మెట్రో స్టేషన్లలో ఫ్రీ పార్కింగ్​సదుపాయం కల్పించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, డీవైఎఫ్ఐ రాష్ట్ర  కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.ప్రదీప్ డిమాండ్ చేశారు. గురువారం యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోలు మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ సౌకర్యానికి చార్జీలు వసూలు చేయడం కరెక్ట్​కాదన్నారు. తక్షణమే నాగోలు, మియాపూర్ మెట్రో స్టేషన్లతోపాటు మిగిలిన అన్ని స్టేషన్లలో ఫ్రీ పార్కింగ్ కల్పించాలని డిమాండ్ చేశారు.