Son of Sardaar 2 : నవ్వుల అల్లరికి న్యూ డేట్ .. సన్‌‌ ఆఫ్ సర్దార్ 2 మూవీ వాయిదా

Son of Sardaar 2 : నవ్వుల అల్లరికి న్యూ డేట్ .. సన్‌‌ ఆఫ్ సర్దార్ 2 మూవీ వాయిదా

అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్ జంటగా విజయ్ కుమార్ ఆరోరా రూపొందించిన చిత్రం ‘సన్‌‌ ఆఫ్ సర్దార్ 2’.  జియో  స్టూడియోస్ సమర్పణలో అజయ్ దేవగణ్, జ్యోతి దేశ్‌‌పాండే  నిర్మించారు. జులై 25న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వారం రోజులపాటు వాయిదా వేస్తున్నట్టు తెలియజేస్తూ.. శనివారం కొత్త రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ‘నవ్వుల అల్లరికి  కొత్త డేట్’ అంటూ  ఆగస్టు 1న వరల్డ్‌‌వైడ్‌‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 

ఇప్పటికే  వరుస ప్రమోషన్స్‌‌తో బిజీగా ఉన్నారు అజయ్, మృణాల్.  ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌కు సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు చిత్రం ‘మర్యాద రామన్న’ ఆధారంగా ‘సన్‌‌ ఆఫ్‌‌ సర్దార్‌‌‌‌’ తెరకెక్కించగా, దానికి సీక్వెల్‌‌గా పన్నెండేళ్ల తర్వాత ఈ చిత్రాన్ని రూపొందించారు.  గతంలో పంజాబ్ బ్యాక్‌‌డ్రాప్‌‌ స్టోరీ కాగా ఈసారి స్కాట్లాండ్‌‌ నేపథ్యంలో తెరకెక్కించారు.  డబుల్ డోస్‌‌ ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌ను అందించబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు.