అభివృద్ధి పనులు చేపట్టాలంటే అధికారం ఉండాలె : అజిత్ పవార్

అభివృద్ధి పనులు చేపట్టాలంటే అధికారం ఉండాలె :   అజిత్ పవార్

ముంబై: అభివృద్ధి పనులు చేపట్టాలంటే అధికారంలో ఉండటం ముఖ్యమని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీపీ) నాయకుడు అజిత్ పవార్ అన్నారు. ద్రోహం చేయడం, మనోభావాలను దెబ్బ తీయడం తన లక్ష్యం కాదని ఆయన తెలిపారు. సోమవారం తన మద్దతుదారులకు అజిత్ పవార్ లేఖ రాశారు. “నేను భావజాలంతో రాజీ పడకుండా భిన్నమైన రాజకీయ వైఖరిని తీసుకున్నాను. 

ఇక నుంచి ఎన్‌‌‌‌‌‌‌‌సీపీ.. తన అభివృద్ధి ఎజెండాను అమలు చేస్తుంది. సీనియర్ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయదు” అని అజిత్ పవార్ పేర్కొన్నారు. ఎన్ సీపీ వ్యవస్థాపకుడైన శరద్ పవార్ పేరు చెప్పకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. ''ఎన్నికైన ప్రజాప్రతినిధిగా నేను అధికార, ప్రతిపక్షం వైపు ఉన్నాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పనులకు అడ్డంకులు ఎదురవుతాయి. కాబట్టి, ఎన్నికైన ప్రజా ప్రతినిధిగా పని చేస్తున్నప్పుడు అధికారం  అవసరం” అని అజిత్ పవార్ వెల్లడించారు.