గాంధీనగర్: ఆసియా సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా పతకాల జోరు కొనసాగుతోంది. గురువారం జరిగిన మెన్స్ 71 కేజీల విభాగంలో అజిత్ నారాయణ రెండు కాంస్య పతకాలతో మెరిశాడు. క్లీన్ అండ్ జర్క్‌లో 174 కేజీల బరువు ఎత్తిన అజిత్... ఓవరాల్‌గా 314 కేజీల బరువు లిఫ్ట్ చేసి మూడో ప్లేస్‌లో నిలిచాడు.
ఆరంభం నుంచి ఆసియాలోని మేటి లిఫ్టర్లతో గట్టి పోటీ ఎదురైనా.. తన అసాధారణ బలంతో ఆకట్టుకున్నాడు. వోన్ జు రీ (కొరియా) 351 కేజీలు, జియాన్ చెన్ (చైనా) 355 కేజీల బరువు ఎత్తి వరుసగా స్వర్ణం, రజతం సొంతం చేసుకున్నారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో పతకం సాధించిన మూడో ఇండియన్ లిఫ్టర్‌గా అజిత్ నిలిచాడు.
