కాంగ్రెస్​ది డాగ్ విజిల్ పాలిటిక్స్.. రేవంత్ రెడ్డి కామెంట్లకు ఓవైసీ కౌంటర్​

కాంగ్రెస్​ది డాగ్ విజిల్ పాలిటిక్స్.. రేవంత్ రెడ్డి కామెంట్లకు ఓవైసీ కౌంటర్​

హైదరాబాద్: తాను షేర్వాణి కింద ఖాకీ నిక్కర్ ధరిస్తానంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్​ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. ‘రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కీలు బొమ్మ. మీకు చెప్పడానికి ఏమీ లేనప్పుడు మా బట్టల గురించి మాట్లాడటం మొదలు పెడ్తరు. దీనినే డాగ్ విజిల్ పాలిటిక్స్ అంటరు. రేవంత్ ​ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు. ఆ సంస్థతో అతడికి ఇప్పటికీ కనెక్షన్ ఉంది. ఆయన్ను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కంట్రోల్​ చేస్తున్నడు’ అని ఓవైసీ ఆరోపించారు.