వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదు..ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదు..ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌‌‌‌‌‌‌‌ ఒవైసీ వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మే బుడే హోగయా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదు.. చేయను’’ అని ఆయన పేర్కొన్నారు. పాతబస్తీలోని తన ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా తన రాజకీయ ప్రయాణం గురించి మాట్లాడుతూ... తాను కేవలం 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని, అయితే తన విద్యాసంస్థల ద్వారా ఇంజనీరింగ్, మెడిసిన్‌‌‌‌‌‌‌‌తో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తయారు చేస్తున్నానని తెలిపారు.‘‘నేను ఇంటర్మీడియెట్ వరకే చదువుకున్నాను.. కానీ నేను ఏం మాట్లాడినా దానికి సీఎం స్వయంగా సమాధానం చెప్పే స్థాయికి ఎదిగాను’’ అని ఆయన పేర్కొన్నారు.