తెలుగు సినిమా బాక్సాఫీస్‌పై 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ , మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు తిరుగులేని రికార్డ్ ఉంది. 'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి మూడు బ్లాక్‌బస్టర్‌ల తర్వాత, ఈ డైనమిక్ ద్వయం నుండి వస్తున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ 'అఖండ 2: తాండవం' (Akhanda 2 Thaandavam) ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2021లో 'అఖండ' సృష్టించిన సునామీని మించి, ఈ 'తాండవం' మరింత రౌద్రంగా, శక్తిమంతంగా ఉండబోతోందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
'తాండవం' ప్రోమో విడుదల
'అఖండ' సక్సెస్ వెనుక బాలయ్య రౌద్రం, బోయపాటి టేకింగ్‌తో పాటు ఎస్.ఎస్. తమన్ అందించిన శివతాండవ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణ. ఇప్పుడు ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. డిసెంబర్ 5, 2025న (Akhanda 2 Thaandavam Release Date) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానుల ఎదురుచూపులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే, చిత్ర బృందం శుక్రవారం 'ది తాండవం ప్రోమో'ను విడుదల చేసి అంచనాలను మరింత పెంచింది. తమన్ తన బీజీఎంతో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మరోసారి ప్రాణం పోస్తున్నట్టు ఈ ప్రోమో స్పష్టం చేసింది.
బాలయ్య పాన్-ఇండియా 'తాండవం'
'అఖండ 2: తాండవం' కేవలం తెలుగుకే పరిమితం కావడం లేదు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నందమూరి కుటుంబం నుంచి ఎం. తేజస్విని నందమూరి ఈ ప్రాజెక్ట్‌ను సమర్పించడం ఈ సినిమాకు మరింత హైప్ ను తీసుకోచ్చింది..
ఇప్పటికే విడుదలైన టీజర్లలో, బాలకృష్ణ మంచు కొండల్లో నాగసాధువు గెటప్‌లో త్రిశూలం పట్టుకుని కనిపించిన విజువల్స్.. 'అఖండ' క్యారెక్టర్‌ను మరో స్థాయిలో నిలబెట్టాయి. అధర్మంపై ధర్మాన్ని నిలబెట్టే బాలయ్య పోరాటం, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. డిసెంబర్ 5న బాలయ్య అభిమానులకు పండగ వాతావరణం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
