విమానంలో పిల్లికి పర్మీషన్ ఇస్తేనే ఇండియాకు వస్తా

విమానంలో పిల్లికి పర్మీషన్ ఇస్తేనే ఇండియాకు వస్తా

రష్యా బాంబుల దాడితో ఉక్రెయిన్ దద్దరిల్లుతోంది. అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయం.. భయంతో బతుకుతున్నారు.  ఇక విదేశీయుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. స్వదేశాలకు వెళ్లిపోయేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్ వెళ్లిన 21 ఏళ్ల అఖిల్ రాధాకృష్ణన్ మాత్రం స్వదేశానికి వచ్చేందుకు ఓ కండీషన్ పెట్టాడు. తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న అమ్మి(పిల్లి)ని విమానంలోకి అనుమతిస్తేనే తాను ఇండియాకు వస్తానని చెప్పారు. దీంతో భారత రాయభార కార్యాలయం అందుకు అనుమతించింది. దీంతో అఖిల్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అమ్మితో తన బంధం విడదీయరానిదని చెప్పాడు. 

మరిన్ని వార్తల కోసం

ఒకే ఏడాదిలో 9 మిసైల్స్ ను ప్రయోగించిన నార్త్ కొరియా