Ranji Trophy 2024: ఓటమికి తలొంచని విదర్భ.. ఉత్కంఠ రేపుతోన్న రంజీ ట్రోఫీ ఫైనల్

Ranji Trophy 2024: ఓటమికి తలొంచని విదర్భ.. ఉత్కంఠ రేపుతోన్న రంజీ ట్రోఫీ ఫైనల్

కళ్ళ ముందు 538 పరుగుల లక్ష్యం..  ప్రత్యర్థిగా 41 సార్లు ఛాంపియన్ ముంబై..ఈ దశలో ఎవరైనా ముంబై విజయం ఖాయమనుకుంటారు. అయితే విధర్భ వెనకడుగు వేయలేదు. తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది. సమిష్టిగా ఆడుతూ ముంబై బౌలర్లను వణికిస్తున్నారు. ఏకపక్ష మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశారు. దీంతో రంజీ ట్రోఫీ ఫైనల్ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. 

రంజీ ట్రోఫీలో ముంబై 42వ ట్రోఫీని గెలుచుకునేందుకు బాటలు వేసుకున్నా.. ఫైనల్లో  ఆ జట్టుకు విదర్భ గట్టి పోటీ ఇస్తోంది. నాలుగో రోజు ఆటలో కరుణ్ నాయర్ (220 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లతో 74), కెప్టెన్ అక్షయ్‌‌‌‌‌‌‌‌ వాడ్కర్ (91 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 56 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను చివరి రోజుకు తీసుకెళ్లారు. ఓవర్ నైట్ స్కోర్ 248/5 స్కోరుతో ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన విదర్భ పట్టు వదలకుండా పోరాడుతుంది. 
 
అక్షయ్‌‌‌‌‌‌‌‌ వాడ్కర్, హర్ష దూబే  ఆరో వికెట్ కు అజేయంగా 97 జోడించి మ్యాచ్ ను రసవత్తరంగా మార్చేశారు. తొలి సెషన్ లో అసలు వికెట్ కోల్పోకుండా వీరు బ్యాటింగ్ చేసిన తీరు అద్బుతమనే చెప్పాలి. ప్రస్తుతం విదర్భ 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. క్రీజ్ లో అక్షయ్‌‌‌‌‌‌‌‌ వాడ్కర్ (80), హర్ష దూబే(56) ఉన్నారు. విదర్భ గెలవాలంటే మరో 218 పరుగులు చేయాలి. మరో వైపు ముంబై గెలవాలంటే 5 వికెట్లు తీయాల్సి ఉంది. ఈ రోజే చివరి రోజు కావడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి.