కరీం నగర్ ఏఎంసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గా ఆకుల నర్సయ్య

కరీం నగర్ ఏఎంసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గా ఆకుల నర్సయ్య
  • వైస్ చైర్మన్ తో పాటు డైరెక్టర్ల నియామకం

కరీంనగర్ సిటీ,వెలుగు: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త పాలకవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆకుల నర్సయ్య, వైస్ చైర్మన్ గా సుదగోని లక్ష్మీనారాయణ గౌడ్,  డైరెక్టర్లుగా పంజాల శ్రీనివాస్ గౌడ్, బోనాల శ్రీనివాస్, ఖాజా, రుద్ర రాము, మీసాల శంకర్, తపట్ల రాజు, జగ్గని కనకయ్య, రావణవేణి సంపత్, కసవేని భూమయ్య, మాలోతు మాలతి, శివనాధుని వెంకటేశ్వర్లు, పల్లా శివకుమార్‌‌‌‌‌‌‌‌ను నియమించారు. 

ఈ సందర్బంగా నర్సయ్య మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తానని కరీంనగర్ మార్కెట్ కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. తనకు పదవి రావడానికి సహకరించిన సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జిల్లా మంత్రులు శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు.