నాకు లభించిన పెద్ద కాంప్లిమెంట్ అది

నాకు లభించిన పెద్ద కాంప్లిమెంట్ అది

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుండు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో కథానాయికగా అమూల్య పాత్రలో ప్రేక్షకుల్ని అలరించారు పూజా హెగ్డే. సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నానంటోంది ఈ అమ్మడు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ..” ‘అల..వైకుంఠపురములో’ ని అమూల్య పాత్ర తో నేను మరింతగా తెలుగమ్మాయిని అయిపోయాను. మామూలుగా నాకు తెలుగు రాదు. ఇంగ్లీష్ పదాల్ని తెలుగులో చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. తెలుగు లైన్స్ ను అర్థం చేసుకొని వాటిని ఎలా చెప్పాలో తెలుసుకుంటున్నా. నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోవడం ‘అరవింద సమేత’ నుంచి స్టార్ట్ చేశాను. ఆ సినిమా రిలీజయ్యాక ఒకరు “ఈ సినిమాకు మీకెవరు డబ్బింగ్ చెప్పారు? నేను కూడా చెప్పించుకుందామని అనుకుంటున్నా” అని మెసేజ్ పెట్టారు. అది నా డబ్బింగ్ కు లభించిన పెద్ద కాంప్లిమెంటుగా భావిస్తాను. అంటే ఒక తెలుగు అమ్మాయిలా అందులో మాట్లాడగలిగానని సంతోషం వేసింది.

నేను వర్క్ చేసిన డైరెక్టర్లలో త్రివిక్రమ్ గారు చాలా కామ్ డైరెక్టర్. డైరెక్టర్ ఎనర్జీయే సెట్లో కనిపిస్తుంది. సెట్లో డైరెక్టర్ నవ్వుతూ, ప్రశాంతంగా కనిపిస్తే, మన స్ట్రెస్ తగ్గిపోతుంది. తాను పెద్ద సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ని అని తెలిసినా, దాన్ని ఆయన బయట ప్రదర్శించరు. అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే నేను అతని వర్క్ కు అభిమానిని. అతనితో కలిసి పనిచెయ్యడాన్ని ఎంజాయ్ చేస్తాను. అలాగే ప్రస్తుతం ప్రభాస్ తో పనిచెయ్యడాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నా.

2019లో నేను చేసిన పాత్రల్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. అవన్నీ ఒకదానికొకటి భిన్నమైన పాత్రలు. ‘గద్దలకొండ గణేశ్’లో నన్ను శ్రీదేవిలాగా అంగీకరించారు. ‘మహర్షి’లో కాలేజ్ స్టూడేంట్ గా, కార్పొరేట్ గాళ్ గా ఆదరించారు. ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ బన్నీ బాస్ రోల్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ రోల్స్ లో ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చెయ్యడం హ్యాపీ. వర్సటాలిటీ నా బలమని నమ్ముతాను” అని చెప్పింది పూజా.

ala vaikunta puramulo Heroine Pooja Hegde says about her best compliment