ఆలంపూర్, వెలుగు : బీటెక్ స్టూడెంట్ కౌన్సిలర్‌గా విజయం సాధించింది. గద్వాల జిల్లా ఆలంపూర్ మున్సిపాలిటీలోని తొమ్మిదో వార్డు బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో అదే వార్డుకు చెందిన శేఖర్‌రెడ్డి కూతురు, బీటెక్ థ స్ట్ ఇయర్ చదువుతున్న మాధురి బీఆర్‌ఎస్ తరఫున పోటీకి దిగింది. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఆమె కాంగ్రెస్ క్యాండిడేట్‌పై 84 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. 21 సంవత్సరాలు ఉన్న మాధురి.. ప్రస్తుతం ఎన్నికైన కౌన్సిలర్లలో అతి చిన్న వయస్కురాలు కావడం గమనార్హం.
