అంపైర్‌ను బూతులు తిట్టి..  రాకెట్​తో చైర్​ను కొట్టి

అంపైర్‌ను బూతులు తిట్టి..  రాకెట్​తో చైర్​ను కొట్టి

మెక్సికన్​ ఓపెన్‌ నుంచి సస్పెన్షన్​​
అకాపుల్కో:
జర్మనీ టెన్నిస్‌ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌.. మెక్సికన్‌ ఓపెన్‌ టోర్నీలో సహనం కోల్పోయాడు. డబుల్స్‌ మ్యాచ్‌లో ఓటమిని తట్టుకోలేక.. అంపైర్​ను బూతులు తిట్టి చైర్‌ను బలంగా కొడుతూ రాకెట్‌ను విరగ్గొట్టాడు. దీనిపై ఆగ్రహించిన ఆర్గనైజర్స్​.. రూల్స్‌ బ్రేక్‌ చేసినందుకు జ్వెరెవ్‌ను టోర్నీ నుంచి సస్పెండ్‌ చేశారు.  మంగళవారం రాత్రి జ్వెరెవ్‌–మెలో జోడీ 2–6, 6–4, 6–10తో లాయిడ్‌ హీలియోవోరా చేతిలో ఓడింది. అయితే లాస్ట్‌ సెట్‌లో లాయిడ్​ కొట్టిన ఓ షాట్‌పై జ్వెరెవ్‌ ప్రొటెస్ట్‌ చేయగా, చైర్​ అంపైర్‌ రిజెక్ట్​ చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన జ్వెరెవ్‌ అంపైర్​ను తిట్టాడు. మ్యాచ్​ పూర్తయ్యాక అంపైర్‌ దగ్గరికొచ్చి మరోసారి తిడుతూ రాకెట్‌ను చైర్‌కేసి బలంగా కొట్టి విరగ్గొట్టాడు. జ్వెరెవ్​ తీరుపై టెన్నిస్​ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.