ఫ్రెంచ్ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌

ఫ్రెంచ్ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌

పారిస్: జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్.. ఫ్రెంచ్ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సెమీఫైనల్లో రెండో సీడ్ జ్వెరెవ్ 7–5, 6–-2, 3–6, 6–3 తేడాతో జాకుబ్ మెన్సిక్‌‌‌‌‌‌‌‌ (చెక్‌‌‌‌‌‌‌‌)పై గెలిచాడు. దాంతో తాను సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ కలను నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు.

కెరీర్‌‌‌‌‌‌‌‌లో నాలుగోసారి, ఫ్రెంచ్ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో రెండోసారి గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరిన జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌కు ఇప్పటివరకు ఒక్క మేజర్ టైటిల్ కూడా దక్కలేదు. గతంలో ఆడిన మూడు ఫైనల్స్ లోనూ రన్నరప్‌‌‌‌‌‌‌‌తోనే సరిపెట్టుకున్నాడు. ఇక ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరిన ఐదో యాక్టివ్‌‌‌‌‌‌‌‌ మెన్స్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా రికార్డులకెక్కాడు. 

ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో రెండు సెట్లు మాత్రమే కోల్పోయిన జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ తన ట్రేడ్‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌‌‌‌‌ షాట్లతో అలరించాడు. 3 గంటల పోరాటంలో జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌ 8 ఏస్‌‌‌‌‌‌‌‌లు, రెండు డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఏడు బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో నాలుగింటిని కాచుకున్నాడు. 42 విన్నర్లు, 37 అన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 

4 ఏస్‌‌‌‌‌‌‌‌లు, 5 డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌ చేసిన మెన్సిక్‌‌‌‌‌‌‌‌ నాలుగు బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో ఒకదాన్ని కాపాడుకున్నాడు. 32 విన్నర్లు, 41 అనవసర తప్పిదాలు చేశాడు. ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్లలో అత్యధికంగా ఫైనల్స్‌‌‌‌‌‌‌‌ చేరిన వారి జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.