ఆలియా భట్ ఇంట తీవ్ర విషాదం

ఆలియా భట్ ఇంట తీవ్ర విషాదం

బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ ఇంట విషాదం నెలకొంది. ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్ కన్నుమూశారు. 93 ఏళ్ళ వయసున్న ఆయన కొన్ని నెలలుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. వారం రోజులుగా ఐసీయులో చికిత్స పొందుతున్న ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

 తాతయ్య మరణంతో అలియా భట్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. తన తాతయ్య వీడియోను షేర్ చేస్తూ.. "మా తాతయ్య నా హీరో. 93 వయస్సులో కూడా ఆయన గోల్ఫ్ ఆడాడు. నాకు బెస్ట్ ఆమ్లెట్ చేసి ఇచ్చారు. ఎన్నో కథలను చెప్పారు. తన ముని మనవరాలితో ఆడుకున్నారు. మీరు కుటుంబం కోసం ఎంతో తాపత్రయపడేవారు. మా తాత చేసినదంతా మాకు ఆనందాన్ని అందించడం కోసమే. ఆయన దగ్గర పెరిగినందుకు నేను ఆశీర్వాదంగా మరియు కృతజ్ఞతగా భావిస్తున్నాను ” అంటూ సుదీర్గ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్  ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.