కృతి ఈ అవార్డుకు అర్హురాలు

కృతి ఈ అవార్డుకు అర్హురాలు

గంగూభాయి కతియావాడి సినిమాకు గానూ ఆలియా భట్​నేషనల్​ అవార్డు కొల్లగొట్టింది. తన సంతోషాన్ని తాజాగా ఆమె ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది. ఈ సందర్భంగా నేషనల్​ అవార్డుకు ఎంపికైన మరో నటి కృతి సనన్​పై పొగడ్తలు కురిపించింది. అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఇదంతా ప్రేక్షకుల వల్లే సాధ్యమైంది. 

కృతి సనన్​ నటించిన  మిమీ సినిమా చూసి నేను చాలా సేపు ఏడుస్తూ ఉండిపోయాను. వెంటనే కృతికి మెసేజ్​ చేశాను. ఆమె ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. జాతీయ అవార్డుకు కృతి సనన్​ అర్హురాలు అంటూ తన నోట్​లో ఆలియా పేర్కొంది. 

కృతి సనన్​ మిమీ అనే సినిమాలో గర్భవతిగా నటించి మెప్పించింది. ఇక కృతి సైతం దీనిపై ఆలియాకు కృతజ్ఞతలు తెలిపింది. పార్టీకి రెడీగా ఉండు అంటూ రిప్లై ఇచ్చింది. ఈ అవార్డుల ప్రకటనతో బాలీవడ్​లో ఈ ఇద్దరు హీరోయిన్ల పేరు మరోసారి మార్మోగిపోతోంది.