ఆస్పత్రిలో ఆలియా..డబ్బులు కట్టకపోతే ట్రీట్మెంట్ చేయమంటుర్రు

ఆస్పత్రిలో ఆలియా..డబ్బులు కట్టకపోతే ట్రీట్మెంట్ చేయమంటుర్రు

తన బిడ్డను కాపాడాలని ఆలియా తల్లి నుజాత్​ బేగం కన్నీళ్లు పెట్టుకున్నారు. జింఖానా గ్రౌం డ్స్​లో జరిగిన తోపులాటలో గాయపడ్డ ఆలియా ప్రస్తుతం సికింద్రాబాద్​లోని యశోద హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ పొందుతున్నారు. ‘‘మా కూతురు ఆలియా కోహ్లీ అభిమాని. గురువారం తెల్లవారుజామున జింఖానా గ్రౌండ్స్‌‌కి వచ్చాం. గేట్‌‌ బయట తొక్కిసలాటలో గాయపడింది.యశోద హాస్పిటల్‌‌కి తరలించారు. అడ్మిట్‌‌ టైంలో రూ.60 వేలు కట్టాలన్నారు. రూ.17వేలు కట్టాం. మళ్లీ రూ.40వేలు కట్టాలంటున్నారు. డబ్బులివ్వకపోతే ట్రీట్‌‌మెంట్‌‌ చేయమన్నారు. పాపని తీసుకెళ్లాలని అంటున్నారు. మా కూతురికి తల, ఛాతి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఎవ్వరూ సాయం చేయడం లేదు’’ అని నుజాత్​ బేగం విలపించారు. 

లాఠీచార్జ్ తో ఉద్రిక్తత... భయంతో పరుగులు

ఇండియా - ఆస్ట్రేలియా టీ 20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకం ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్లక్ష్యం క్రికెట్ అభిమానుల ప్రాణాలతో చెలగాటం ఆడింది. పోలీసులు లాఠీచార్జ్, తొక్కిన లాటతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. గాయపడ్డవారిలో ఇద్దరు ఐసీయూలో ట్రీట్ మెంట్ పొందుతుంద గా... ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్లో (గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. క్రికెట్ అభి హెచ్సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్ పై పోలీసులు కేసు మానుల్లో భయాందోళనలు సృష్టించింది. ఈ ఘటనతో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌‌ గౌడ్‌‌  ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. హెచ్‌‌సీఏ నిర్వహణ లోపంతోనే ఇదంతా జరిగిందని శ్రీనివాస్​గౌడ్​ మండిపడ్డారు. హెచ్‌‌సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్​పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.