పోరాటాలతోనే హక్కుల సాధన.. అఖిల భారత ఆదివాసీ మహాసభ ఇన్చార్జి అనీరాజా

పోరాటాలతోనే హక్కుల సాధన.. అఖిల భారత ఆదివాసీ మహాసభ  ఇన్చార్జి అనీరాజా

పాల్వంచ, వెలుగు: అటవీ హక్కుల సాధన కోసం పోరాటాలే శరణ్యమని కేరళకు చెందిన సీపీఐ అనుబంధ అఖిల భారత ఆదివాసీ మహాసభ ఇన్​చార్జి అనీరాజా పేర్కొన్నారు. ఆదివారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని లారీ ఓనర్స్  అసోసి యేషన్  హాల్ లో తెలంగాణ గిరిజన సమాఖ్య 3వ మహాసభకు ఆమె హాజరై మాట్లాడారు. 

గిరిజన హక్కుల సాధనకు కదం తొక్కాలని, ఏజెన్సీ చట్టాల పరిష్కారం కోసం సమిష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పోడు సాగుదారులపై జరుగుతున్న దాడులు, నిర్బంధాలపై, అటవీ హక్కుల పరిరక్షణకు పోరాటం చేయాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలతో గిరిజన ప్రాంతాల్లో హక్కులు నిర్వీర్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 అణచివేత వైఖరిని గిరిజనులు ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. టీజీఎస్  రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి అంజయ్య నాయక్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్  పాషా, రాష్ట్ర అధ్యక్షుడు రామ్మూర్తి, ముత్యాల విశ్వనాథం, కొ త్తగూడెం కార్పొరేషన్  మేయర్  మూడ్  గణేశ్, నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, వీసంశెట్టి పూర్ణ, అడుసుమల్లి సాయిబాబా, భూక్య దస్రు, ఉప్పుశెట్టి రాహుల్, బుక్య శ్రీనివాస్, సోందే కుటుంబరావు, వెంకట్  పాల్గొన్నారు.