డిసెంబర్ 16 నుంచి పోలీస్ బ్యాండ్ పోటీలు

డిసెంబర్ 16  నుంచి  పోలీస్ బ్యాండ్ పోటీలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: దక్షిణ మధ్య రైల్వేలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్​పీఎఫ్​) 26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలను  ఈ నెల 16 నుంచి 20 వరకు నిర్వహించనునున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. మౌలాలీలోని ఆర్‌పీఎఫ్ శిక్షణా కేంద్రంలో ఈ పోటీలు జరుగనున్నాయి. తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ బి.శివధర్ రెడ్డి గెస్ట్​గా పాల్గొంటారు. 

1999లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర పారా -మిలిటరీ దళాలు రొటేషన్ పద్ధతిలో నిర్వహిస్తున్నాయన్నారు. దీనిని ఇప్పుడు అఖిల భారత పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ ఆర్​పీఎఫ్​కు కేటాయించింది. ఏపీ, అస్సాం పోలీస్, అస్సాం రైఫిల్స్, బిహార్, బీఎస్ఎఫ్, చత్తీస్‌గఢ్, సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఐటీబీపీ, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, తమిళనాడు, తెలంగాణ, కేంద్ర పారా-మిలిటరీ దళాల నుంచి సుమారు 24 జట్లు, 1500 మంది ప్రదర్శనకారులు ఈ పోటీలో పాల్గొననున్నారు.