విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు కట్టినోళ్లంతా పాస్!

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు కట్టినోళ్లంతా పాస్!

హైదరాబాద్, వెలుగు:  ఇప్పటికే ఇంటర్ అడ్వాన్స్‌‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసి సెకండియర్‌‌లో అందరినీ పాస్​ చేసిన సర్కార్‌‌, మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. మార్చిలో ఎగ్జామ్ ఫీజు కట్టి వివిధ కారణాలతో పరీక్షలు రాయని స్టూడెంట్లను కూడా పాస్ చేయాలని ఆలోచిస్తోంది. దీనిపై ఇంటర్ బోర్డు చేసిన ప్రపోజల్‌‌ను ఓకే చేస్తూ.. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశముంది. సర్కారు నిర్ణయంతో 27 వేలకు పైగా స్టూడెంట్లకు లబ్ధి చేకూరనుంది. మార్చిలో జరిగిన సెకండియర్​పరీక్షలకు సుమారు 4.11లక్షల మంది రెగ్యులర్ స్టూడెంట్లు హాజరయ్యారు. కరోనా ఎఫెక్ట్‌‌తో పరీక్షలు రాసిన మూడు నెలల తర్వాత జూన్‌‌లో ఇంటర్ బోర్డు రిజల్ట్స్ ఇచ్చింది. దీంట్లో 68.86 శాతం మంది పాసయ్యారు. రాష్ట్రంలో కరోనా విజృంభించడంతో అడ్వాన్స్‌‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేసి, 1.47 లక్షల మంది సెకండియర్ స్టూడెంట్లను మినిమమ్ మార్కులతో సర్కార్‌‌ పాస్ చేసింది.

అయితే మార్చిలో జరిగిన పరీక్షలకు మరో 27 వేలకు పైగా విద్యార్థులు ఫీజు కట్టినా, వివిధ కారణాలతో ఎగ్జామ్స్ ​రాయలేదు. దీంట్లో ప్రమాదాలు, జ్వరంతో పాటు వివిధ కారణాలతో ఒకటి, రెండు పరీక్షలు రాయని వారే ఎక్కువమంది ఉన్నారు. వీరిలో ఫీజు కట్టినా ఏ పరీక్షా రాయని వారూ సుమారు తొమ్మిది వందల మంది వరకూ ఉన్నారు. ఈ క్రమంలో తమకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని లేదంటే, పాస్ చేయాలని విద్యార్థులు ఇంటర్ బోర్డు, సర్కార్‌‌ను కోరారు. అయితే దీనిపై లీగల్ ఆఫీసర్లతో, సర్కారు ఉన్నతాధికారులతో ఇంటర్ బోర్డు చర్చించింది. చివరికి ఫీజు కట్టిన వారందరినీ పాస్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అందరికీ 35 శాతం మినిమమ్ మార్కులు వేసి పాస్ చేయాలనే ప్రతిపాదనలను ఇంటర్ బోర్డు.. సర్కార్‌‌కు పంపించింది. దీనికి సర్కారు ఓకే చెప్తుందని బోర్డు ఆఫీసర్లు భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే సర్కార్‌‌ నిర్ణయం ప్రకటించే అవకాశముంది. అయితే సెకండియర్ ​స్టూడెంట్స్ అయినా, ఫస్టియర్ ​బ్యాక్ లాగ్ సబ్జెక్టులున్నా.. వారిని కూడా పాస్​ చేయనున్నారు.

For More News..

అంపైర్‌ను బాల్​తో కొట్టిన జొకోవిచ్.. డిస్ క్వాలిఫై చేసిన రిఫరీలు