జమ్మూనేతలను విడిచిపెట్టండి: అఖిలపక్షాల ఆందోళన

జమ్మూనేతలను విడిచిపెట్టండి: అఖిలపక్షాల ఆందోళన

ఆర్టికల్  370  రద్దుకు  వ్యతిరేకంగా  ఢిల్లీలోని  జంతర్  మంతర్  దగ్గర  అన్ని  పార్టీలు  ఆందోళనకు దిగాయి.  DMK ఆధ్వర్యంలో  అఖిలపక్ష ఆందోళన జరుగుతోంది.  జమ్మూకశ్మీర్ లో  అరెస్ట్ చేసిన  నేతలను విడుదల  చేయాలని… ప్రజాస్వామ్యాన్ని  కాపాడి… మానవ హక్కులను  పరిరక్షించాలనే  డిమాండ్ తో  ధర్నా చేస్తున్నారు.  CPI  జాతీయ ప్రధాన   కార్యదర్శ …..డి రాజా,  CPM  జాతీయ  ప్రధాన కార్యదర్శి  సీతారాం ఏచూరీ,  కాంగ్రెస్ నేతలు  గులాం నబీ ఆజాద్,  కార్తి చిదంబరం,   RJD నేత  మనోజ్ ఝా,  సమాజ్ వాదీ  నేత  రాంగోపాల్ యాదవ్  కూడా హాజరయ్యారు.

జంతర్ మంతర్ దగ్గర DMK ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిలపక్ష ఆందోళనకు JNU విద్యార్థి సంఘం నాయకురాలు షెహ్లా రషీద్ హాజరైంది. జమ్మూకశ్మీర్ లో నేతల అరెస్ట్ ల విషయంలో… ఆర్మీ, భద్రతా బలగాలపై షెహ్లా రషీద్ అభ్యంతరకర ట్వీట్లు చేశారు. ఆర్మీని అవమానించేలా ఆమె చేసిన ట్వీట్లు వివాదం రేపాయి. గతంలోనూ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దేశాన్ని ముక్కలు చేస్తామంటూ… నినాదాలు చేసినట్టు షెహ్లా రషీద్ పై ఆరోపణలున్నాయి.