రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో ఢిల్లీ అనెక్స్ భవనంలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది.. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో కేంద్రం సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరింది. రేపటి నుంచి ఆగస్టు 10 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు రాష్ట్రపతి ఓటింగ్ ఉంటుంది. సమావేశానికి కాంగ్రెస్ నుంచి మల్లికార్జునఖర్గే, జైరామ్ రమేశ్, రాష్ట్రీయ లోక్ దళ్ నుంచి ఎంపీ జయంత్ చౌదరి, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ హాజరయ్యారు.