- ఇండియా అండర్-19 టీమ్ హ్యాట్రిక్ విక్టరీ
- మూడో వన్డేలో 233 రన్స్ తేడాతో సౌతాఫ్రికాపై ఘన విజయం
- 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్
బెనోనీ: సౌతాఫ్రికా టూర్‌లో ఇండియా కుర్రాళ్లు మరోసారి కుమ్మేశారు. కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (74 బాల్స్‌లో 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 127), హైదరాబాదీ ఆరోన్ జార్జ్ (106 బాల్స్‌లో 16 ఫోర్లతో 118) దంచికొట్టడంతో.. బుధవారం జరిగిన ఆఖరిదైన మూడో యూత్ వన్డేలో ఇండియా అండర్–19 టీమ్ 233 రన్స్ తేడాతో సౌతాఫ్రికాపై గ్రాండ్ విక్టరీ సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది.తొలుత ఇండియా 50 ఓవర్లలో 393/7 స్కోరు చేసింది. తర్వాత సౌతాఫ్రికా అండర్ –19 టీమ్ 35 ఓవర్లలో 160 రన్స్‌కే ఆలౌటైంది. పాల్ జేమ్స్ (41) టాప్ స్కోరర్.
భారీ ఛేజింగ్‌లో సఫారీలను కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు సూపర్ సక్సెస్ అయ్యారు. 15 రన్స్‌కే జోరిచ్ వాన్ (1), అద్నాన్ (9), లిథాబో (0), బుల్‌బిలియా (4)ను ఔట్ చేశారు. రోవెల్స్ (19), బోస్మన్ (40) ఐదో వికెట్‌కు 35 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. మిడిల్‌లో పాల్ జేమ్స్, కోర్ని బోతా (36 నాటౌట్) మెరుగ్గా ఆడే ప్రయత్నం చేసినా ఇండియా బౌలింగ్ ముందు సక్సెస్ కాలేకపోయారు. చివర్లో మైఖేల్ క్రుయిస్కాంప్ (1), జేజే బాసన్ (1), ఎంటాడో సోనీ (6) సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో సౌతాఫ్రికాకు భారీ ఓటమి తప్పలేదు. కిషన్ సింగ్ 3, ఇనామ్ 2 వికెట్లు పడగొట్టారు. సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి.
ఓపెనర్లు అదుర్స్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియా ఓపెనర్లు సూర్యవంశీ, జార్జ్.. సఫారీ బౌలర్లను ఊచకోత కోశారు. స్టార్టింగ్ నుంచే ఫోర్లు, సిక్స్‌లతో హోరెత్తించడంతో పరుగుల వరద పారింది. 63 బాల్స్‌లోనే సెంచరీ అందుకున్న సూర్యవంశీ తొలి వికెట్‌కు 25.4 ఓవర్లలోనే 227 రన్స్ జోడించి వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వేదాంత్ త్రివేది (34) మోస్తరుగా ఆడాడు. అప్పటికే సెంచరీ పూర్తి చేసిన జార్జ్ రెండో వికెట్‌కు 52 రన్స్ జత చేసి ఔటయ్యాడు. దాంతో ఇండియా 279/2 స్కోరుతో నిలిచింది. ఈ దశలో విజృంభించిన సఫారీ బౌలర్లు చకచకా వికెట్లు తీశారు.
వరుస విరామాల్లో అభిగ్యాన్ కుండు (21), హర్వన్ష్ పంగాలియా (2), ఆర్‌ఎస్ అంబరీష్ (8), కనిష్క్ చౌహాన్ (10)ను ఔట్ చేశారు. దాంతో 56 రన్స్ తేడాతో ఇండియా 5 వికెట్లు చేజార్చుకుంది. 335/7 వద్ద వచ్చిన మహ్మద్ ఇనామ్ (28 నాటౌట్), హెనిల్ పటేల్ (19 నాటౌట్) భారీ హిట్టింగ్ చేశారు. ఇద్దరూ ఎనిమిదో వికెట్‌కు 58 రన్స్ జత కావడంతో ఇండియా భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. ఎంటాండో 3, రోవెల్స్ 2 వికెట్లు తీశారు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 50 ఓవర్లలో 393/7 (సూర్యవంశీ 127, ఆరోన్ జార్జ్ 118, ఎంటాడో 3/61). సౌతాఫ్రికా: 35 ఓవర్లలో 160 ఆలౌట్ (పాల్ జేమ్స్ 41, బోస్మన్ 40, కిషన్ సింగ్ 3/15, ఇనామ్ 2/36).
- యూత్ వన్డే క్రికెట్‌లో సెంచరీ చేసిన యంగెస్ట్ అండర్-19 కెప్టెన్‌గా 14 ఏండ్ల సూర్యవంశీ రికార్డుకెక్కాడు.
