Kalki 2898 AD Event: కల్కి ఈవెంట్‍కు డేట్,టైమ్ ఫిక్స్..బుజ్జీ x భైరవను కలిసే వేదిక ఎక్కడంటే?

Kalki 2898 AD Event: కల్కి ఈవెంట్‍కు డేట్,టైమ్ ఫిక్స్..బుజ్జీ x భైరవను కలిసే వేదిక ఎక్కడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas),మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్(Nag AShwin)కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD).దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్, నార్త్ కు సంబందించిన స్టార్స్ నటించారు. వారిలో.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్. దీపికా పదుకొనే, దిశా పటాని కీ రోల్స్  చేస్తున్నారు. అందుకే ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి.

రీసెంట్గా కల్కి నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. 'Skratch EP4: Building A Superstar BUJJI' పేరుతో వీడియోను రిలీజ్ చేశారు.ఈ వీడియోలో, భైరవ పాత్రలో నటించిన ప్రభాస్,బుజ్జి అనే తన ఫ్యూచరిస్టిక్ కారును చూపించారు.అలాగే మేకర్స్ అందరు బుజ్జి గురించి మాట్లాడుతూ..ఆడియన్స్లో మరింతగా హై లెవల్ బజ్ క్రియేట్ చేశారు.

"మన బాడీని మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో..బుజ్జిని కూడా ఓ బ్రెయినే కంట్రోల్ చేస్తుంది" అని ఈ వీడియోలో తెలిపారు. అంతేకాకుండా ఈ స్పెషల్ వెహికల్ ‘బుజ్జీ’ కోసం ఓ భారీ ఈవెంట్ జరగనుంది. తాజాగా ఈ ఈవెంట్ కు సంబంధించిన డేట్, టైమ్‍, వేదికను కల్కి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

రేపే భారీ ఈవెంట్..టైమ్ ఇదే

భైరవ బెస్ట్ ఫ్రెండ్ ‘బుజ్జీ’ అనే స్పెషల్ కారును పరిచయం చేసేందుకు బుధవారం (మే 22న 5 PM)కు భారీ ఈవెంట్ నిర్వహించేందుకు కల్కి మేకర్స్ రెడీ అయ్యారు. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ ను హైదరాబాద్‍లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‍గా జరుపనున్నట్లు  వెల్లడించారు. అయితే కల్కి మేకర్స్ ఈ సినిమా కోసం నిర్వహించే ఫస్ట్ ఈవెంట్ కావడంతో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకు తగ్గట్టుగానే రామోజీ ఫిల్మ్ సిటీలో కళ్ళు చెదిరేలా సెట్ ని నిర్మించినట్లు తెలుస్తోంది. 

అయితే, రేపు (మే 22న) జరగనున్న కల్కి ఈవెంట్‍లో నటించబోయే నటులు, స్టోరీ థీమ్, సాంగ్స్ ఇలా ప్రతిఒక్క విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ఈవెంట్ కి విచ్చేసే ముఖ్య అతిథులు ఎవరనేది తెలియాల్సి ఉంది.భారీ తారాగణం,భారీ బడ్జెట్‍తో రానున్న ఈ సినిమా జూన్ 27న రిలీజై..ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.