ఓయూ పరిధిలో జూన్ 20న నిర్వహించే పరీక్షలు వాయిదా

ఓయూ పరిధిలో జూన్ 20న నిర్వహించే పరీక్షలు వాయిదా

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో జూన్ 20వ తేదీన నిర్వహించబోయే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా 20వ తేదీన స్టేట్ ఎడ్యుకేషన్ డే ఉత్సవాలు ఉండటంతో.. పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు ప్రకటించారు. వాయిదా వేసిన పరీక్షల తేదీలను ఓయూ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.