ఎన్నికలను బహిష్కరిస్తాం : కొడిశెలమిట్ట గిరిజనులు

ఎన్నికలను బహిష్కరిస్తాం : కొడిశెలమిట్ట గిరిజనులు
  • తునికాకు బోనస్​ కోసం కొడిశెలమిట్ట గ్రామస్తుల అల్టిమేటం

కొత్తగూడ,(గంగారం)వెలుగు :  తమకు రావాల్సిన తునికాకు బోనస్​ డబ్బులు ఇవ్వకపోతే తాము ఎన్నికలను బహిష్కరిస్తామని మహబూబాబాద్​ జిల్లా గంగారం మండలం కొడిశెలమిట్ట గిరిజనులంతా అల్టమేటం జారీ చేశారు. ఈమేరకు తహసీల్దార్​ రాము,ఎంపీడీవో అపర్ణలకు వేరు వేరుగా వినతి పత్రాలు ఇచ్చారు.2016 నుండి 2021 వరకు తాము తునికాకు కూలీలుగా ఆకు సేకరించామన్నారు.  

అందుకు మాకు రావాల్సిన బోనస్​ డబ్బులు రాలేదన్నారు.ఏన్ని సార్లు ఫారెస్ట్ ఆఫీసర్లకు విన్నవించిన పట్టించుకోవడం లేదని, అందుకే ఈనెల 30 న జరిగే ఎన్నికలను బహిష్కరించాలని గ్రామస్తులందరం నిర్ణయించుకున్నామనిపేర్కోన్నారు.