మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో నేరాల నియంత్రణ కోసం పోలీసులు వేగంగా స్పందించాలని మహబూబాబాద్ ఎస్పీ శబరీశ్ కోరారు. శనివారం జిల్లా కేంద్రంలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రశంసా పత్రాలను అందించారు. అనంతరం నిర్వహించిన క్రైమ్సమీక్షలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లోని హత్య కేసులు, దొంగతనం, ఇతర కేసులపై దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో "అరైవ్ అలైవ్" అవగాహన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతి రావు తదితరులున్నారు.
