
కొంత కాలంగా వరుస సీరియస్ సబ్జెక్టులతో మెప్పిస్తున్న అల్లరి నరేష్(Allari Naresh)..తిరిగి తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నాడు.తన 61వ సినిమా అయిన ఆ ఒక్కటీ అడక్కు (Aa Okkati Adakku) తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మల్లి అంకం దర్శకుడి గా పరిచయమవుతున్న ఈ మూవీ నుంచి రిలీజైన టైటిల్ గ్లింప్స్,పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ కొనుగోలు చేసింది. తెలంగాణ, ఏపీ థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ సంయుక్తంగా దక్కించుకుంది.ఏషియన్ సినిమాస్,సురేష్ ప్రొడక్షన్స్ ఇటీవల జతకట్టిన విషయం తెలిసిందే. సమ్మర్ లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
మీకు, మీ కుటుంబ సభ్యులందరికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ? pic.twitter.com/dL95iyrI09
— Allari Naresh (@allarinaresh) April 9, 2024
రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ విషయానికి వస్తే..మొత్తంగా 66 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ ఆద్యంతం సరదాగా సాగింది. తన కామెడీ టైమింగ్‍తో అల్లరి నరేశ్ అదరగొట్టారు.తన మార్క్ ఎంటర్‌టైన్‍మెంట్‍తో నవ్వుకునేలా ఉంది. పెళ్లి కోసం ఆరాటపడే యువకుడు గణ పాత్రను పోషించిన అల్లరోడు..తనదైన కామెడీతో అల్లరి చూపించాడు. అతడికి 25 రోజుల 10 గంటల 5 నిమిషాల్లోగా పెళ్లి జరగాలని, లేకపోతే జన్మంతా బ్రహ్మాచారిగానే ఉండిపోతాడని జ్యోతిష్యుడు చెప్పడంతో టీజర్ సినిమాపై ఇంపాక్ట్ పెంచుతోంది.
పెళ్లి అనేది పాన్ ఇండియా సమస్య అని చెప్పడం సినిమాపై బజ్‌ను పెంచేలా ఉంది. ఫరియా అబ్దుల్లా(FariaAbdullah) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.