
కొంత కాలంగా వరుస సీరియస్ సబ్జెక్టులతో మెప్పిస్తున్న అల్లరి నరేష్(Allari Naresh)..తిరిగి తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నాడు.తన 61వ సినిమా అయిన ఆ ఒక్కటీ అడక్కు (Aa Okkati Adakku) తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మల్లి అంకం దర్శకుడి గా పరిచయమవుతున్న ఈ మూవీ నుంచి రిలీజైన టైటిల్ గ్లింప్స్,పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్.ఓ 49 సంబంధాలు చూసినా పెళ్లవక 50వ సంబంధం సెట్టవుతుందా..? లేదా ? అని నేను టెన్షన్ పడుతుంటే..పెళ్లాం..పిల్లలని వెక్కిరిస్తున్నావేంట్రా..అంటూ నరేశ్ కామెడీ టచ్‌తో ఉన్న ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
తన కామెడీ టైమింగ్‍తో అల్లరి నరేశ్ అదరగొట్టారు. తన మార్క్ ఎంటర్‌టైన్‍మెంట్‍తో నవ్వుకునేలా ఉంది. పెళ్లి కోసం ఆరాటపడే యువకుడు గణ పాత్రను పోషించిన అల్లరోడు..తనదైన కామెడీతో అల్లరి చూపించాడు. అతడికి 25 రోజుల 10 గంటల 5 నిమిషాల్లోగా పెళ్లి జరగాలని, లేకపోతే జన్మంతా బ్రహ్మాచారిగానే ఉండిపోతాడని జ్యోతిష్యుడు చెప్పడం..ఆ తర్వాత పెళ్లెప్పుడు అని గణను అందరూ అడుగటం సరదాగా ఉంది. ఇక అతడికి పెళ్లి సంబంధం కుదిర్చేందుకు ఫ్యామిలీ మెంబర్స్ పలు విధాలుగా ట్రై చేయడం ఆకట్టుకుంటోంది.
పెళ్లి అనేది పాన్ ఇండియా సమస్య అని చెప్పడం సినిమాపై బజ్‌ను పెంచేలా ఉంది. ఫరియా అబ్దుల్లా (FariaAbdullah) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
నరేష్ తండ్రి ఈవీవీ సత్యనారా యణ ఇరవై రెండేళ్ల క్రితం ఇదే టైటిల్‌తో సూపర్ హిట్‌ను అందించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు తన తండ్రి టైటిల్‌తో వస్తున్నాడు నరేష్.
సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత..మార్చి 22న ఆ ఒక్కటీ అడక్కు థియేటర్లో రిలీజ్ అవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.కాగా పోస్ట్ ప్రోడక్షన్ పనుల కారణంగా..ఈ చిత్రాన్ని మే 3న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.