ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. బీజేపీ అప్పీల్‌‌‌‌‌‌‌‌పై నేడు విచారణ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. బీజేపీ అప్పీల్‌‌‌‌‌‌‌‌పై నేడు విచారణ

హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు పేరుతో రాష్ట్ర పోలీసులు బీజేపీని ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆ పార్టీ స్టేట్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ జి.ప్రేమేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌ను మంగళవారం హైకోర్టు విచారించనుంది. ఈ విషయాన్ని చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌రెడ్డిల డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ సోమవారం ప్రకటించింది. సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును నిలిపివేస్తూ ఇచ్చిన ఆర్డర్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయడాన్ని పిటిషన్​లో బీజేపీ సవాల్​ చేసింది. బీజేపీని దోషిగా నిలబెట్టే కుట్ర జరుగుతున్నదని, సీఎం, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అగ్రనేతలు దర్యాప్తునకు ముందే ఏం జరగబోయేదీ విలేకరుల సమావేశంలో చెప్పేశారని పిటిషన్​లో పేర్కొన్నారు. మొయినాబాద్‌‌‌‌‌‌‌‌ ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌లో అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 26న ఈ ఘటన జరిగితే.. మధ్యవర్తుల సంతకాలు అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 27న ఉన్నాయని గుర్తు చేశారు. దీన్నిబట్టి చూస్తే పక్కా ప్లాన్​ ప్రకారమే బీజేపీని టార్గెట్​ చేసినట్టు తెలుస్తోందని వివరించారు. ఈ కేసును సీబీఐకి లేదా హైకోర్టు నియమించే సిట్‌‌‌‌‌‌‌‌కు అప్పగించాలని కోరారు. ఘటన జరిగిన వెంటనే నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌కు తరలించడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు.