ఏసీబీకి చిక్కిన ఆళ్లపల్లి ఎంపీవో, మర్కోడ్ ​జీపీ కార్యదర్శి

ఏసీబీకి చిక్కిన ఆళ్లపల్లి ఎంపీవో, మర్కోడ్ ​జీపీ కార్యదర్శి

ఆళ్లపల్లి, వెలుగు :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి ఎంపీవో, మర్కోడ్​ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి చిక్కారు. మర్కోడ్ మాజీ ఉపసర్పంచ్ కుర్ర కమల చేసిన పనులకు సంబంధించిన పెండింగ్​బిల్లులు పాస్ చేయడానికి ఎంపీవో బత్తిన శ్రీనివాస్, మర్కోడ్​ పంచాయతీ కార్యదర్శి నాగరాజు రూ.15 వేలు డిమాండ్ చేశారు. దీంతో ఆమె ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం మండల పరిషత్​ఆఫీసులో కమల నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటున్న శ్రీనివాస్, నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల ఇద్దరిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ రమేశ్ తెలిపారు. ​