
- మోదీపై అవిశ్వాసం
- ఎన్డీఏ X ఇండియా
- అవిశ్వాసానికి బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతు
- తాము వ్యతిరేకమని వెల్లడించిన వైఎస్సాసీపీ
- బీఆర్ఎస్ నోటీసుపై సైన్ చేసిన ఎంఐఎం అధినేత అసద్
- సంఖ్యాబలం లేక వీగిపోనున్న తీర్మానం
- మణిపూర్ పై చర్చించే వ్యూహంలో భాగమే అన్న విపక్షాలు
వ్యతిరేకం 331
అనుకూలం 141
తటస్థం 71
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై ఇండియా పార్టీల కూటమి, బీఆర్ఎస్ లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. నిన్నటి వరకు మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని పట్టుబట్టిన విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం. లోక్ సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు గౌరవ్ గొగొయ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్ కు నోటీసు అందించారు. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా నోటీసు ఇచ్చారు. నామా ఇచ్చిన నోటీసుపై ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ కూడా సంతకం చేయడం గమనార్హం.
సాధారణంగా 50 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు ఉంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి వీలుంటుంది. ప్రస్తుతం ఎన్డీఏకు లోక్ సభలో 330 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలో 8 సీట్లు తక్కువగా ఉండటం గమనార్హం. ఇండియా కూటమి పార్టీల బలం 140 మంది సభ్యులు. మరో 60 మంది ఏ కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాసం వీగిపోవడం దాదాపుగా ఖాయమే! అయినా విపక్షాలు వ్యూహాత్మకంగానే అవిశ్వాసం అస్త్రాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 2018లో మోదీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అప్పుడు ఎన్డీఏకు 325, విపక్షాలకు 126 మంది ఎంపీల మద్దతు ఉండగా వీగిపోయింది.
మెజార్టీ లేకున్నా ‘అవిశ్వాసం’
ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయేకూటమికి 331 మంది సభ్యుల మద్దతుంది. ‘ఇండియా’ కూటమితో కలిపి వివిధ పార్టీలకు చెందిన 141 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు పలుకుతున్నారు. మరో 71 మందికిపైగా ఏ కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం దాదాపు ఖాయమే అయినప్పటికీ.. కేవలం మణిపుర్ అంశంలో చర్చల కోసం ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. గతంలో 2018లో మోదీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎన్డీయేకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగిపోయింది.
లోక్ సభ సెక్రటరీని కలిసిన నామా
మణిపూర్, తదితర ముఖ్య అంశాలపై చర్చించకుండా బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్ కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు నేతృత్వంలో లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ను కలిశారు.