
ఆర్ధిక మంత్రి హరీశ్ రావుకు మరో కీలక శాఖ అప్పగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌కు.. వైద్యారోగ్య శాఖను కేటాయించారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ తమిళి సై సంతకం చేశారు. దీంతో ఇక నుంచి ఆర్ధిక శాఖతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించనున్నారు.
గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ మంత్రి వర్గం నుంచి తొలగించిన తర్వాత...ఆ శాఖను కేసీఆర్ వద్దే ఉంది.