మల్కాజిగిరి, వెలుగు: ఎస్సీ వర్గీకరణతో మాలలకు జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో లేవనెత్తాలని మాల సంఘాల జేఏసీ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కోరింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేరా బాలకిషన్ మంగళవారం ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణతో 58 ఉప కులాలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఆ చట్టాన్ని సవరిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టేలా ఒత్తిడి తేవాలని కోరారు. మాల సంఘల జేఏసీ నాయకులు మాస శేఖర్, బత్తుల రమేశ్, బత్తుల దిలీప్, అలక నరసింహారావు, సఖి గంగాధర్ రావు పాల్గొన్నారు.
