జీహెచ్ఎంసీలో విలీనమైతే కంటోన్మెంట్‎లోనూ అభివృద్ధి: ఎమ్మెల్యే శ్రీగణేశ్

జీహెచ్ఎంసీలో విలీనమైతే కంటోన్మెంట్‎లోనూ అభివృద్ధి: ఎమ్మెల్యే శ్రీగణేశ్

పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్​ను కూడా జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీలో విలీనం చేస్తే ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి వేగంగా అభివృద్ధి చేసుకోవచ్చని ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్రం కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. మోండా డివిజన్ లో ₹70 లక్షలతో సీవరేజ్ పైప్ లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. అంబేద్కర్ నగర్, టీచర్స్ కాలనీ, రైల్ నిలయం ప్రాంతాల్లో ఎన్నో ఏండ్లుగా ఉన్న సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు.