దేశ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

దేశ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ఓల్డ్​సిటీ, వెలుగు: దేశ సంస్కృతీ సంప్రదాయాలను యువత కాపాడాలని రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ పిలుపునిచ్చారు. మంగళవారం సాలార్ జంగ్ మ్యూజియం 74వ వార్షికోత్సవానికి ఆయన గెస్ట్‎గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు తరాల నిజాం చరిత్రను ఈ మ్యూజియం ప్రతిబింబిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రిన్సిపల్​ కార్యదర్శి దాన కిషోర్, అకౌంటెంట్ జనరల్ చందా పండిత్, వైస్ చాన్స్​లర్​ మొల్గారాం, సాలార్ జంగ్ మ్యూజియం బోర్డు సభ్యులు నవాబ్ అతరం అలీ ఖాన్,  డైరెక్టర్​ప్రియాంక మేరీ పాల్గొన్నారు.