న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ లో వాటాను పెంచుకోవడానికి ఆర్బీఐ నుంచి అనుమతి పొందింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ పెయిడప్ క్యాపిటల్ లేదా ఓటింగ్ హక్కులలో 9.5 శాతం వరకు వాటాను సేకరించడానికి ఆమోదం తెలిపింది. నిబంధనల ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ వాటాను ఒక ఏడాది లోపు కొనాలి. లేకుంటే అనుమతి రద్దవుతుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ బోర్డులో హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ప్రాతినిధ్యం ఉండదు. వాటా ఎప్పుడూ 9.5 శాతానికి మించకూడదు.
