ఎల్లవేళలా అందుబాటులో ఉంటా.. సమస్యలు ఏమున్నా చెప్పండి: మాజీ మంత్రి తలసాని

 ఎల్లవేళలా అందుబాటులో ఉంటా.. సమస్యలు ఏమున్నా చెప్పండి: మాజీ మంత్రి తలసాని

పద్మారావునగర్, వెలుగు: సమస్యలు ఏమున్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోయగూడలోని ఉప్పలమ్మ టెంపుల్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఏ ఇబ్బంది వచ్చినా తానున్నానని చెప్పారు. బస్తీ ప్రజలంతా కలిసి కట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు.