వైద్యరంగానికి రూ.6,186 కోట్లు

వైద్యరంగానికి  రూ.6,186 కోట్లు

అసెంబ్లీలో 2020-2021 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టిన హరీష్ రావు  వైద్యరంగానికి రూ.6,186 కోట్లు ప్రవేశ పెట్టారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజా వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి విస్తృత చర్యలు చేపట్టిందన్నారు. కేసీఆర్ కిట్  పథకం అద్భుత ఫలితాలిచ్చిందన్నారు.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో  ప్రసవాల సంఖ్య 22 శాతం పెరిగిందన్నారు. గర్భిణ స్త్రీలు ఆస్పత్రికి వచ్చిపోవడానికి 22 అమ్మఒడి వాహనాలను ప్రభుత్వ ఏర్పాటు చేసిందన్నారు. గతంలో కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలుండగా కొత్తగా 4 మెడికల్ కాలేజీలు ప్రారంభించామన్నారు. హైదరాబాద్ నగరంలో 118 బస్తీ దవఖానాలు పేదలకు వైద్య సేవలనందిస్తున్నాయన్నారు.  వీటి సంఖ్యను 350 కి పెంచుతామన్నారు.

కంటి వెలుగు ద్వారా కోటి 54 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగానే మందులు ,అద్దాలు పంపిణీ చేశామన్నారు. అత్యుత్తమ వైద్య సేవల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచినట్లు నీతి అయోగ్ చెప్పిందన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలు కరోనా వైరస్ పై వచ్చే వదంతులు నమ్మొద్దన్నారు.