32 ఏళ్ల రాజకీయ అనుభవం..అల్లోల

32 ఏళ్ల రాజకీయ అనుభవం..అల్లోల

నిర్మల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 1949 ఫిబ్రవరి 16న జన్మించారు. తల్లిదండ్రులు చిన్నమ్మ, నారాయణరెడ్డి. భార్య విజయలక్ష్మి, ఒక కుమారుడు, కుమార్తె . బీకాం, LLB చదివారు ఇంద్రకరణ్ రెడ్డి.

32ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఇంద్రకరణ్ రెడ్డి సొంతం. 1987లో జడ్పీ చైర్మన్ గా పనిచేశారు ఇంద్రకరణ్. 1991లో ఆదిలాబాద్ ఎంపీగా విజయం సాధించారు. 1999, 2004లో ఎమ్మెల్యేగా , 2008లో మరోసారి ఎంపీగా పనిచేశారు. 2014లో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి దేవాదాయ , గృహ నిర్మాణ, న్యాయ శాఖ మంత్రిగా పని చేశారు. 2018 ముందస్తు ఎన్నికల్లో నిర్మల్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఇంద్రకరణ్ రెడ్డికి …మరోసారి మంత్రి పదవి దక్కింది.