పాలిటెక్నిక్​లో 20 వేల మందికి సీట్లు

పాలిటెక్నిక్​లో  20 వేల మందికి సీట్లు

హైదరాబాద్, వెలుగు: పాలిసెట్ అడ్మిషన్  కౌన్సెలింగ్ ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తయ్యింది.  20,862 మందికి పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లు కేటాయించారు. 114 కాలేజీల్లో 29,610 సీట్లకుగానూ.. 20,862 సీట్లు నిండాయని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. 57 సర్కారు కాలేజీల్లో 11,461 (83.7%)  సీట్లు నిండగా,  57 ప్రైవేటు కాలేజీల్లో 9,401 (59.05%) నిండాయని వెల్లడించారు. మరో 8,748 సీట్లు మిగిలాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15లోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలన్నారు.