
శ్రీవిష్ణు పోలీస్ ఆఫీసర్‌గా నటించిన లెటెస్ట్ ఫిల్మ్ ‘అల్లూరి’ ట్రైలర్ విడుదలైంది. ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన నేచురల్ స్టార్ ‘నాని’ ట్రైలర్ ను ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ట్రైలర్ ఎనర్జిటిక్ గా ఉండడమే కాకుండా చాలా బాగుందని కితాబిచ్చారు. విష్ణు ఎంచుకునే పాత్రలు, స్క్రిప్ట్స్ నాకిష్టమన్నారు. ఈ మూవీ విషయంలో అతను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని, సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని ఆకాంక్షించారు.
మంచి సినిమాలను ప్రోత్సహించే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆదరించాలన్నారు. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ఇదోక హానేస్ట్ మూవీగా పేర్కొన్నారు. హీరో నాని ట్రైలర్ ను లాంచ్ చేయడం హ్యాపీగా ఉందని తెలిపారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని ప్రకటించారు. మంచి కంటెంట్ తో సినిమా రూపొందడం జరిగిందని నిర్మాత బెక్కం వేణుగోపాల్ వెల్లడించారు. కచ్చితంగా ఆకట్టుకుంటుందన్నారు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. ఈ నెల 23న సినిమా విడుదల కానుంది.