
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రాములో రాములా అనే సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. సాంగ్ లో లిరిక్స్, అల్లు అర్జున్ డ్యాన్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నారు.
ఇప్పటి వరకు ఆసాంగ్ కు యూట్యూబ్ లో 130మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. అయితే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలవుతున్న నేపథ్యంలో అల్లుఅర్జున్ ఫ్యామిలీతో సరదగా గడిపేస్తున్నారు.
అయితే ఫ్యామిలీతో ఉన్నప్పుడు అల్లుఅర్జున్ చిన్న పిల్లోడిలా మారి వారితో అల్లరి చేస్తుంటాడు. అప్పుడప్పుడు ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లోనూ షేర్ చేస్తుంటాడు. తాజాగా తన కూతురు అల్లు అర్హతో కలిసి చేసిన అల్లరిని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
కూతురు అర్హను మీ నాన్న ఏ సినిమా చేస్తున్నాడని అర్హను అడుగుతాడు. అందుకు అర్హా అలా వైకుంటపురంలో అని చెబుతోంది. అందులో నాన్న ఎల్లో కలర్ జాకెట్ వేసుకొని డ్యాన్స్ చేస్తాడుగా అ సాంగేంటని అడిగితే రాములో రాములా అని అర్హా ముద్దుగా చెబుతోంది. మళ్లీ అందులో ఏం స్టెప్ వేస్తాను అని అర్హాని అడగడంతో అర్హా దోశ స్టెప్ వేశావు అంటూ అల్లు అర్జున్ ను ఆట పట్టిస్తోంది . తండ్రి, కూతురు మధ్య జరిగిన సంభాషణను అల్లుఅర్జున్ వీడియో తీసి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.