
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్(Pushpa the rule). క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. పుష్ప 2 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఇవాళ (ఏప్రిల్ 8)అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా రిలీజైన పుష్ప 2 టీజర్ తో గంగమ్మజాతర మొదలైందని హింట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ టీజర్ కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూసిన ఫ్యాన్స్ ఆశలు ఎంతవరకు గట్టెక్కాయి. ఆశించిన హైప్ చేరిందా లేదా అనేది తెలుసుకుందాం.
టీజర్ హైలైట్స్ ఇవే..
పుష్ప 2 టీజర్ మాత్రం గంగమ్మజాతరతో అదిరిపోయింది.ఓ మహాశక్తి అవతారం నిజంగానే అల్లు అర్జున్ లో పూనిన ఫీలింగ్ కళ్ళకు కనిపించింది. అల్లు అర్జున్ పట్టుచీర కట్టుకొని..ముఖానికి కలగలిపిన రంగులతో..మెరిసే ఆభరణాలు, కాళ్ల గజ్జలు, మెడలో దండలతో అమ్మవారి అవతారంలో అదరగొట్టేశాడు.
జాతర సీక్వెన్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ తో కట్ చేసిన టీజర్ ఆద్యంతం పూనకాలు తెప్పించింది. టీజర్ లో విలన్ ను కాలితో తన్ని అదే కాలితో చీర కొంగుని తీసుకొని నడుములో చెక్కుకునే సీన్ అయితే మాస్.. ఊర మాస్ అనే రేంజ్ లో ఉంది. చివర్లో అల్లు అర్జున్..హుప్ అని వింత సౌండ్ తో అరవగానే అందరూ భయపడి వెనక్కి వెళ్లే షాట్ అదిరిపోయింది. దేవీ శ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అల్లు అర్జున్ స్వాగ్ కి ఉపిరి అని చెప్పుకోవాలి.
పుష్ప 2 గ్లింప్స్‌లా ఉంది
అయితే, ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవ్వడం మొదలైంది. ఇది టీజర్‌లా కాకుండా మొత్తానికి ఓ స్మాల్ గ్లింప్స్‌లా ఉందనే అభిప్రాయాలు నెటిజన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి.అందుకు కారణం లేకపోలేదు. ఈ టీజర్ మొత్తం గంగమ్మ జాతర సీన్ ల,ఓ మాత్రమే ఉంది.
అంతేకాదు అల్లు అర్జున్ కూడా ఒకే గెటప్‍లో టీజర్ లో కనిపించారు.ఇక్కడ ఐకాన్ కి ఒక్క డైలాగ్ కూడా లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే..పుష్పరాజ్ అమ్మవారి అవతారాన్ని చూపించేందుకు రిలీజ్ చేసిన వీడియోలా అనిపించింది. దీంతో ఇది పుష్ప 2 టీజర్ అనే దానికంటే..గ్లింప్స్‌లా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.
అయితే, ఏడాది తర్వాత వచ్చిన ఈ అప్డేట్ తో పుష్ప 2 కథ ఏమైనా తెలుస్తుందేమోనని ఆశించిన ఫ్యాన్స్ కి నిరాశ అయితే మిగిలింది.అంతేకాదు..ఇక్కడ విలన్స్, యాక్టర్స్ గురించి రివీల్ చేయలేదు.