అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టు ‘రాకా’. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా, తాజాగా నెక్స్ట్ షెడ్యూల్‌కు సంబంధించిన అప్‌డేట్ గురించి తెలిసింది. ఈ సినిమా తదుపరి షూటింగ్ ఈ నెలాఖరు నుంచి ముంబైలో ప్రారంభం కానుంది.
ఈ షెడ్యూల్‌ను చాలా కీలకంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అల్లు అర్జున్‌తోపాటు హీరోయిన్‌గా నటిస్తున్న దీపికా పదుకొణె కూడా షూటింగ్‌లో పాల్గొననున్నట్టు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరిపై పలు కీలక సన్నివేశాలు, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించనున్నట్టు సమాచారం.
హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిస్తుడటంతో వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. షూటింగ్ పూర్తయిన తర్వాత వీఎఫ్‌ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
అందుకే దర్శకుడు అట్లీ ముందుగానే టాకీ పార్ట్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచాయి.
