భార్యకు అల్లు అర్జున్ స్పెషల్ విషెస్..నెటిజన్లు ఫిదా

భార్యకు అల్లు అర్జున్ స్పెషల్ విషెస్..నెటిజన్లు ఫిదా

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటే అల్లు అర్జున్(Allu Arjun..Sneha Reddy)స్నేహారెడ్డి అనడంలో సందేహం లేదు. స్టార్ అల్లు అర్జున్ వరుస మూవీస్ తో బిజీయెస్ట్ స్టార్ అయినప్పటికీ..తన ఫ్యామిలీ కోసం స్పెషల్ టైం కేటాయిస్తారు. వీరి వివాహ బంధం 2011 సం,,లో జరగగా..ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఇవాళ (సెప్టెంబర్ 29న) అల్లు స్నేహారెడ్డి బర్త్ డే స్పెషల్గా..అల్లు అర్జున్ అదిరిపోయే వీడియో రిలీజ్ చేస్తూ..విషెస్ తెలిపారు.

ఈ వీడియోలో తన భార్య చాలా క్యూట్‌గా ఉందని సింబాలిక్‌గా చెప్పేశాడు ఐకాన్ స్టార్. హ్యాపీ బర్త్ డే క్యూటీ..నా మొత్తం జీవితానికి వెలుగువి నువ్వే అంటూ..స్నేహా రెడ్డికి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్‌ను చెప్పాడు బన్నీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సాధారణంగా స్నేహ ఇంట్లో ఉన్నప్పుడు..బయటకు వెళ్లినప్పుడు తన కెమెరాలో అల్లు అర్జున్ అందంగా బందించాడు. ఈ వీడియోలో స్నేహ రెడ్డి అందంగా నవ్వుతూ..తన లుక్స్ తో ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ కూడా ఒక సామాన్య భర్తలాగే ఇంట్లో ఉంటాడని ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. 

ప్రసెంట్ స్నేహ బర్త్ డే పార్టీని లండన్ లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోస్ కూడా వీరు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక తన భార్య స్నేహ కోసం అల్లు అర్జున్ షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి బర్త్ డే పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా..వీరిద్దరూ ఖాళీ సమయాల్లో ఫారన్ ట్రిప్స్తో జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. సహజంగా సినిమా ఫంక్షన్స్లో తప్ప..హాలిడే ట్రిప్స్లోను, గ్లామర్ క్లిక్స్లోను అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. 

ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ చెప్పిన స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా..సందీప్ రెడ్డి వంగా, అట్లీతోనూ మూవీస్ చేయాడానికి రెడీ అయ్యాడు. ఇలా బన్నీ ఓ పక్క యాడ్స్ చేస్తూనే మరో పక్క పుష్ప రెండో పార్టును కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.