ప్రధాని మోదీ రీల్స్‌లో 'AA23' థీమ్.. పీక్స్‌కు చేరిన అల్లు అర్జున్, అనిరుధ్ క్రేజ్!

 ప్రధాని మోదీ రీల్స్‌లో 'AA23' థీమ్.. పీక్స్‌కు చేరిన అల్లు అర్జున్, అనిరుధ్  క్రేజ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'AA23' ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే రికార్డుల మోత మోగిస్తోంది. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ మూవీ థీమ్ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.  విడుదలైన కొద్ది రోజులకే ఈ థీమ్‌కు అద్భుతమైన స్పందన లభించింది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ.. 12 లక్షలకు పైగా వీడియోల్లో ఈ మ్యూజిక్ దుమ్మురేపుతోంది.

ప్రధాని మోదీ ఎంట్రీ.. పీక్స్‌కు చేరిన క్రేజ్!

ఈ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినీతో భేటీకి సంబంధించిన తన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కు ఈ 'AA23' థీమ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో వాడటంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక దేశాధినేత, తన దౌత్యపరమైన వీడియోకు ట్రెండింగ్ సినిమా మ్యూజిక్‌ను జోడించడం ద్వారా రాజకీయాలు, పాప్ కల్చర్‌ల మధ్య సరికొత్త వారిధిగా నిలిచింది..  సోషల్ మీడియా మొత్తం ఈ ట్రాక్ గురించే మాట్లాడుకోవడం మొదలైంది. అల్లు అర్జున్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈ విషయాన్ని గర్వంగా పంచుకుంటూ వైరల్ చేస్తున్నారు..

 మోదీ డిజిటల్ టీమ్ వ్యూహం!

ప్రధాని మోదీ డిజిటల్ టీమ్ ఇప్పుడు పాతకాలపు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్‌కు స్వస్తి పలికింది. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబించేలా, నేటి యువతను ఆకట్టుకునే న్యూ ఇండియన్ సౌండ్ ను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా రిషబ్ రిఖిరామ్ శర్మ (సితార్ ప్రోడిజీ), అనిరుధ్ రవిచందర్, శశ్వత్ సచ్‌దేవ్ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల బాణీలను ఎంచుకుంటున్నారు.
 

►ALSO READ | సెకండ్ ఇన్నింగ్స్‌లో దూకుడు పెంచిన హన్సిక.. జె.డి. చక్రవర్తితో కలిసి చార్మినార్ వద్ద షూటింగ్!

'రాకా'తో బిజీగా అల్లు అర్జున్..

ఇదిలా ఉంటే AA23 సినిమా ప్రారంభం మాత్రం కొంత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అల్టీతో తెరకెక్కిస్తున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'రాకా' పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2027 డిసెంబర్ విడుదల లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఆ తర్వాతే లోకేష్ కనగరాజ్‌తో AA23 సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే దేశ ప్రధానమంత్రి వీడియోలో చోటు దక్కించుకోవడం, మిలియన్ల రీల్స్‌లో ట్రెండింగ్ కావడం చూస్తుంటే ఇది ఒక సినిమా మాత్రమే కాదు.. ఒక సాంస్కృతిక మారనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు.